Sarvonnathuda neeve naku asraya dhurgamu సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము


Song no: 18

    సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము -2


    ఎవ్వరులేరు - నాకు ఇలలో -2


    ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా -2


  1. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో -2

    వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు -2 ॥ సర్వో ॥




  2. నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు -2

    సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు -2 ॥ సర్వో ॥






  3. నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు -2

    విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు -2 ॥ సర్వో ॥





أحدث أقدم