Paralokamu naa dheshamu paradesi nenila mayalokamega పరలోకము నా దేశము పరదేశి నేనిల మాయలోకమేగ



Song no: 607


పరలోకము నా దేశము

పరదేశి నేనిల మాయలోకమేగ

నేను యాత్రికుడను (2)


ఎంతో అందమైనది పరలోకము

అసమానమైనది నా దేశము (2)

ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2)          ||పరలోకము||


దూతలు పాడుచుందురు పరమందున

దీవా రాత్రమునందు పాడుచుందురు (2)

పావనుని చూచి నేను హర్షింతును నిత్యము (2)          ||పరలోకము||


రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్

వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని (2)

కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ (2)          ||పరలోకము||


అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్

అగుపడుచున్నది గమ్యస్థానము (2)

అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరున్ (2)          ||పరలోకము||


నిత్యానందముండును పరమందున

నీతి సమాధానము ఉండునచ్చట (2)

పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి (2)          ||పరలోకము||


Paralokamu Naa Deshamu

Paradeshi Nenila Maayalokamega

Nenu Yaathrikudanu (2)


Entho Andamainadi Paralokamu

Asamaanamainadi Naa Deshamu (2)

Ellappudu Vishwaasamutho Yaathranu Saaginthunu (2)         ||Paralokamu||


Doothalu Paaduchunduru Paramanduna

Deevaa Raathramunandu Paaduchunduru (2)

Paavanuni Choochi Nenu Harshinthunu Nithyamu (2)         ||Paralokamu||


Rakshakuni Chenthaku Eppudegedan

Veekshincheda Neppudu Naadu Priyuni (2)

Kaankshincheda Naa Madilo Aayana Chenthanunda (2)         ||Paralokamu||


Addariki Eppudu Nenu Velledan

Agupaduchunnadi Gamyasthaanamu (2)

Achchatane Choochedanu Parishuddhulellarin (2)         ||Paralokamu||


Nithyaanandamundunu Paramanduna

Neethi Samaadhaanamu Undu Nachchata (2)

Pondedanu Vishraanthini Shramalanniyu Veedi (2)         ||Paralokamu||


Previous Post Next Post