Yesuke ankitham naa pranam sarvyam యేసుకే అంకితం నాప్రాణం సర్వము




Song no:

యేసుకే అంకితం నాప్రాణం సర్వము...

ప్రభు యేసుకే అంకితం

నా జీవిత సమస్తము.." 2 "

ఓహోహో...నీ సన్నిధిలో

నేను చేయు ప్రార్ధనను

ఆలకించి ప్రత్యుత్తరమిచ్చితివే

ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసి

నను కరుణించి నా ప్రార్ధన వింటివే.....

                  "యేసుకే అంకితం"



మునుపున్న వాటిని జ్ఞాపకము చేసికొనక

పూర్వ కాల  సంగతులు తలంచుకొనక " 2 "

ఇదిగో......నేనొక నూతన క్రియను చేయుచున్నానంటివే

కరుణాతిశయముతో నను కరుణించితివే" 2 "

కరుణాతిశయముతో నను కరుణించితివే........

                  "యేసుకే అంకితం"



వెనుకున్నవన్నీ మరచి

ముందున్నవన్నీ తలచి

పరుగెత్తెదను నీ రక్షణ కొరకు నేను .." 2 "

నా ప్రతి బాష్ప భిందువును

తుడిచెదను అని అంటివే

నీదక్షిణాస్తముతో  దీర్గాయువు నిఛ్చితివే" 2 "

నీదక్షిణాస్తముతో  దీర్గాయువు నిఛ్చితివే........

                    "యేసుకే అంకితం"

أحدث أقدم