Yesu kreesthu mathasthu danaga nerigi manudi jagamu యేసు క్రీస్తు మతస్థుఁ డనఁగా నెఱిఁగి మనుఁడీ జగము


Song no: 360



యేసు క్రీస్తు మతస్థుఁ డనఁగా నెఱిఁగి మనుఁడీ జగము లోపల వాసిగాఁ ప్రభు యేసు దాసులె పరమునందు ని వాసులగుదురు ||యేసు||



యేసు క్రీస్తును నమ్మి యాయన దాసుఁడై వర్తించు నాతఁడె భాసు రంబుగఁ గ్రైస్తవుం డని ప్రాకటంబుగఁ బరగుచుండును ||యేసు||



ఎల్ల సమయములందు ధాత్రిని యేసు నడతలఁ జూచి నడఁచుచు నుల్లమున రక్షకునిఁ దాల్చిన యోర్పరియె క్రైస్తవుఁడు సుమ్ము ||యేసు||



క్రీస్తు నన్ను గొనెను గావున క్రీస్తువాఁడను నేన టంచును క్రైస్తవుండు గొల్చు నాతని వాస్తవమ్ముగ నాత్మ తనువుల ||యేసు||



రాజులు యాజకులు శుద్ధులు రాజనందను లనెడు పేళ్ళను రాజ రాజగు దేవుఁ డొసఁగెను రాజితంబుఁ క్రైస్తవులకును ||యేసు||



క్షయము లేనిది శుద్ధమైనది వ్యయము లేనిది నిత్యమైనది దయను యేసుఁ డొసంగు భాగ్యముఁ దప్పకుండఁ క్రైస్తవులకును ||యేసు||



أحدث أقدم