Iedhi kanniti pata christmas siluva pata ఇది కన్నీటి పాట క్రిస్టమస్ సిలువ పాట




Song no:






పల్లవి:

ఇది కన్నీటి పాట క్రిస్టమస్ సిలువ
పాట ||2||

కరకు గుండెను కరిగించేపాట

కలవారి కొండకు నడిపించే పాట

||ఇది కన్నీటి||



చరణం:

సర్వ సృష్టికర్తకు స్థలము ఎక్కడ

సత్రములో స్థలమైన లేదు ఇక్కడ

సర్వోన్నత శక్తికి ప్రసవమెక్కడ

పశువుల పాకే ప్రసూతి స్థలము
ఇక్కడ

ఆత్మలో తగింపు తత్వమే ||2||

క్రిస్టమస్ సిలువ మార్గము

||ఇది కన్నీటి||



చరణం:

రాజుల రారాజుకు నివాసమెక్కడ

తల వాల్చుటకు తలగడ లేదు ఇక్కడ

ప్రభువుల ప్రభువుకు పీటమెక్కడ

ఒలీవ తోటలో రాళ్ళు రప్పలిక్కడ

మనస్సులో ప్రార్ధన తత్వమే ||2||

క్రిస్టమస్ సిలువ సత్యము

||ఇది కన్నీటి||



చరణం:

భూతలి స్తుతి పాత్రుడు ఏసు అక్కడ

మానవాళి బలి పసువు క్రీస్తు
ఇక్కడ

కృపాసన సీనుడు ఏసు అక్కడ

గొల్గూత గోరియ పిల్ల క్రీస్తు
ఇక్కడ

శరీరాన సమర్పణ తత్వమే ||2||

క్రిస్టమస్ సిలువ జీవము

||ఇది కన్నీటి||



أحدث أقدم