Unna patuna raleka pothunnanu ఉన్నపాటున రాలేక పోతున్నాను




Song no:






పల్లవి:

ఉన్నపాటున రాలేక పోతున్నాను

కన్న పాపము మొయలేకపోతున్నాను

నేను కన్న పాపము మోయలేక
తల్లడిల్లుతున్నాను

తల్లడిల్లుతున్నాను...

రెప్ప పాటున నీ కృప
చాలును

నీ రెక్కల చాటున చేరిపోదును

||ఉన్నపాటున||



చరణం:

ఉన్నవారిని కొట్టి లేని వారికి పెట్టి

సమసమాజ నిర్మానమని మానవ రాజ్య స్థాపనని

చీకటిలోకి వెళ్ళిపోయాను

అరణ్య రోదనై మిగిలిపోయాను

అయ్యో నేనెంత దుర్మార్గుడను

అయ్యో నేనంత దౌర్భాగ్యుడను

||ఉన్నపాటున ||



చరణం:

దివినే విడిచిపెట్టి భువికే దిగివచ్చి

దైవ మానవ సమసమాజమని దేవుని
రాజ్య స్థాపనని

పాప క్షమకై నీ రక్తము చిందించి

శాప విముక్తికై మృతినే గెలిచితివి

అయ్యా నీవెంత నిజమానవుడవు

అయ్యా నీవంత నిజ దేవుడవు

||ఉన్నపాటున||



أحدث أقدم