Kammani bahu kammani challani athi challani కమ్మని బహుకమ్మనీ - చల్లని అతి చల్లనీ






యేసు నీ ప్రేమామృతం


జుంటె తేనె కన్నా మధురం
- సర్వ జనులకు సుకృతం


యేసు నీ ప్రేమామృతం





1. ఆశ చూపెను లోకం
- మలినమాయెను నా జీవితం


యేసూ నీదు ప్రేమ - దయ
చూపెను దీనురాలి
పైన


వెలిగెను నాలో నీ ఆత్మ
దీపము - కడిగిన ముత్యముగా అయ్యాను
నేను





2. నా కురులతో పరిమళమ్ములతో చేసెద
నీదు పాద సేవ


నా గుండె గుడిలో కొలువైయున్న
నీకు చేసెద నేను
మధుర సేవ


ఆరాధింతును
నిన్ను అనుదినము - జీవింతును నీకై
అనుక్షణము



أحدث أقدم