Siramu vanchenu sarvalokam yesu deva nee mundhu శిరము వంచెను సర్వ లొకమ్ యేసు దేవా నీ ముందు




Song no:


HD




    శిరము వంచెను సర్వ లొకమ్ – యేసు దేవా నీ ముందు /2/

    సంతసించె ప్రతి హృదయం /2/- రక్షక నీ జన్మయందు /2/శిరము/



  1. పుట్టిపెరిగి రాజులయ్యేది సహజము – రాజుగానే ఉదయించినావు చిత్రము /2/

    మహిమ సింహాసనం – విడిచి నాకోసము/2/

    పశుల పాకలో పుట్టినావు స్తోత్రము /2/శిరము/



  2. యుద్హముచేసి రాజ్యమేలేది సహజము – శాంతి రాజ్యము స్తాపించినావు చిత్రము/2/

    పరలోకానందము – చేసితివి త్యాగము /2/

    మంటిదేహము దాల్చినావు స్తోత్రము /2/శిరము/



  3. పుట్టి ఒకడు తనను యెరుగుట సహజము – ముందే యెరిగి జన్మించినావు చిత్రము /2/

    మార్పు చేసుకొని నీ మహిమ రూపము /2/

    మనిషి రూపులో – వచ్చినావు స్తోత్రము /2/శిరము/


أحدث أقدم