Santhiki dhuthaga premaku murthiga aasala jyothiga శాంతికి దూతగా – ప్రేమకు మూర్తిగా ఆశల జ్యోతిగా



శాంతికి దూతగా – ప్రేమకు మూర్తిగా

ఆశల జ్యోతిగా – మరియకు సుతునిగా /2/

యేసు జనియించె – ప్రభు యేసు జనియించె /2/

Happy Christmas – Merry Christmas /4/శాంతికి

1.కలుషితాలే తెలియనోడు – కన్యకే జనియించే ..

పసిడి మనసే కలిగినోడు – పేదగా జనియించె

భువనాలనేలువాడు – భవనాలలోన కాదు

పశుశాలలోన నేలపై జనియించె – మన ప్రభువే జనియించె /శాంతికి/

2.శుభము కూర్చే – శిశువు తానై

దిశను మార్చే – సూచనై

పాపమంటి కారుచీకటిలో – ఒక పుణ్యకాంతియై ప్రసరించే..  – ప్రభు తానై – ప్రభవించే నిల! /శాంతికి/

3.నింగిలోని దివ్యవాణి నేలపై ధ్వనియించె

దైవమంటి మమత తానై మనిషిగా ఉదయించే

మనలోని బాధ తీర్చే – జనజీవితాలు మలచే – ఎనలేనిజాలై లాలిగుణమై నిలిచె  – ప్రభుకిరణం – తొలికిరణం  /శాంతికి/


أحدث أقدم