Kondalalo konalalo bethlehemu gramamulo కొండలలో కోనలలో బేత్లెహేము గ్రామములో




Song no:






కొండలలో కోనలలో

బేత్లెహేము  గ్రామములో

కనిపించె ప్రభు దూత

వినిపించేను శుభ వార్త

చెలరేగెనే ఆనందము

రక్షకుని రాకతో (2)    
    ||కొండలలో||


కొరికేసే చలి గాలిలో

వణికించే నడి రేయిలో (2)

కాపరుల భయము తీర

పామరుల ముదము మీర (2)

దూతా గానము

శ్రావ్యా రాగము (2)

పరమ గీతము         ||కొండలలో||


దావీదు పురమందున

పశువుల శాలయందున (2)

మన కొరకే రక్షకుండు

ఉదయించే పాలకుండు (2)

రండి వేగమే

రండి శీఘ్రమే (2)

తరలి వేగమే          ||కొండలలో||



Previous Post Next Post