Sthothramu seyare sodharulara స్తోత్రము సేయరే సోదరులార మన యాత్మలతో


Song no: 605



స్తోత్రము సేయరే సోదరులార మన యాత్మలతోఁ దండ్రిన్ ధాత్రిని మన పర మాత్ముని వాక్కులు స్తోత్రములోఁ గలిపి ||స్తోత్రము||



ఇచ్చట ప్రేమల కిదియే కడవరి వచ్చియున్న దేమో అచ్చట మన మం దఱముఁ గలిసికొని యానందింతుముగా ||స్తోత్రము||



ఎక్కువ ప్రేమలు చక్కని స్తోత్రము లక్కడ మన మంత మిక్కిలి ప్రియుడు దేవుని కిడుదుము ఒక్క మనసుతోను ||స్తోత్రము||



కన్నీ రుండదు చావు కష్టము లెన్నటి కుండవుగా కన్నను మన శృం గారపు బ్రతుకు లెన్నఁదరము గాదె ||స్తోత్రము||



వాగును వీణెలు సాగును పాటలు సతతముగా నచట రాగము లెంతో రమ్య మై యుండును బాగింతన లేము ||స్తోత్రము||



మరల నిచటఁ గూ డుదుమో లేదో మన మందరము త్వరలో మున పర లోకపు దండ్రి తోడ నుందు మేమో ||స్తోత్రము||



గొఱ్ఱెపిల్ల రక్తము విలువచ్చుట గొప్పది గాంతుముగా గురుతరమగు మన దేవుని ప్రేమను కూర్మితో జూతుముగా ||స్తోత్రము||



పరమ తండ్రితోఁ ప్రభుయేసునితోఁ బరిశుద్ధాత్మునితో స్థిరముగనుందుము మరి దూతలతోఁ బరలోకమునందున్ ||స్తోత్రము||

Previous Post Next Post