Punarudthanuda vijaya shiluda naa prana nadhuda పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా




Song no:

పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా   {2}

నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా

నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా    {2}      || పునరుత్థానుడా  ||



 కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య

శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య    {2}

నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య    {2}

ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా  {2}                         || పునరుత్థానుడా  ||



 మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య

అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా  {2}

నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా    {2}

మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా     {2}                    || పునరుత్థానుడా  ||



చరణం:-నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య

కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య      {2}

ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా    {2}

నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య      {2}            || పునరుత్థానుడా  ||



Previous Post Next Post