Nuthana parachumu deva నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల





Song no:


HD




    నూతన పరచుము దేవా

    నీ కార్యములు నా యెడల (2)

    సంవత్సరాలెన్నో జరుగుచున్నను

    నూతనపరచుము నా సమస్తము (2)


    పాతవి గతించిపోవును – సమస్తం నూతనమగును

    నీలో ఉత్సహించుచు – నీకై ఎదురు చూతును || నూతన ||


  1. శాశ్వతమైనది నీదు ప్రేమ

    ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)

    దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా

    నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) || పాతవి ||




  2. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో

    నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)

    తరములలో ఇలా సంతోషకారణముగా

    నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) || పాతవి ||





أحدث أقدم