Margamu chupumu intiki మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి




Song no:

మార్గము చూపుము ఇంటికి –

నా తండ్రి ఇంటికి

మాధుర్య ప్రేమా ప్రపంచమో –

చూపించు కంటికి (2)



పాప మమతల చేత –

పారిపోయిన నాకు

ప్రాప్తించె క్షామము

పశ్చాత్తాప్పమునొంది –

తండ్రి క్షమ కోరుచు

పంపుము క్షేమము (2)

ప్రభు నీదు సిలువ –

ముఖము చెల్లని నాకు

పుట్టించె ధైర్యము (2) ||మార్గము||



ధనమే సర్వంబనుచు-

సుఖమే స్వర్గంబనుచు

తండ్రిని వీడితి

ధరణి భోగములెల్ల –

బ్రతుకు ధ్వంసము జేయ

దేహీ నిను చేరితి (2)

దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు

దారిని జూపుము (2)||మార్గము||



దూర దేశములోన –

బాగుందుననుకొనుచు

తప్పితి మార్గము

తరలిపోయిరి నేను –

నమ్మిన హితులెల్ల

తరిమే దారిద్య్రము (2)

దాక్షిణ్య మూర్తి నీ –

దయ నాపై కురిపించి

ధన్యుని చేయుము (2) ||మార్గము||



అమ్ముకొంటిని నేను –

అధముడొకనికి నాడు

ఆకలి బాధలో

అన్యాయమయి పోయే –

పందులు సహ వెలివేయ

అలవడెను వేదన (2)

అడుగంటె అవినీతి –

మేల్కొనియె మానవత

ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము||



కొడుకునే కాదనుచు –

గృహమే చెరసాలనుచు

కోపించి వెళ్ళితి

కూలివానిగనైన –

నీ యింట పని చేసి

కనికరమే కోరుదు (2)

కాదనకు నా తండ్రి –

దిక్కెవ్వరును లేరు

క్షమియించి బ్రోవుము (2) ||మార్గము||



నా తండ్రి నను జూచి –

పరుగిడిచూ ఏతెంచి

నాపైబడి ఏడ్చెను

నవ జీవమును గూర్చి –

ఇంటికి తోడ్కొని వెళ్లి

నన్నూ దీవించెను (2)

నా జీవిత కథయంత –

యేసు ప్రేమకు ధరలో

సాక్ష్యమై యుండును (2) ||మార్గము||

أحدث أقدم