Sandhehamela samsayamadela prabhu yesu gayamulanu సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను



సందేహమేల సంశయమదేల

ప్రభు యేసు గాయములను పరికించి చూడు

గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2)      ||సందేహమేల||





ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే

నీ పాప శిక్షను తానే – భరియించెనే (2)

ప్రవహించె రక్త ధార నీ కోసమే

కడు ఘోర హింసనొందె నీ కోసమే (2)      ||సందేహమేల|| 





ఎందాక యేసుని నీవు – ఎరగనందువు

ఎందాక హృదయము బయట – నిలవమందువు (2)

యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా

యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2)      ||సందేహమేల||





ఈ లోక భోగములను – వీడజాలవా

సాతాను బంధకమందు – సంతసింతువా (2)

యేసయ్య సహనముతోనే చెలగాటమా

ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2)      ||సందేహమేల||





లోకాన ఎవ్వరు నీకై – మరణించరు

నీ శిక్షలను భరియింప – సహియించరు (2)

నీ తల్లియైన గాని నిన్ను మరచునే

ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2)      ||సందేహమేల||


أحدث أقدم