Parama daivame manushya rupamai పరమ దైవమే మనుష్య రూపమై ఉదయించెను




Song no: o

పరమ దైవమే మనుష్య రూపమై

ఉదయించెను నాకోసమే

అమరజీవమే నరుల కోసమే

దిగివచ్చెను ఈ లోకమే

క్రీస్తు పుట్టెను హల్లెలూయా (3)

||పరమ||



అకార రహితుడు ఆత్మ స్వరూపుడు

శరీరము ధరియించెను

సర్వాధికారుడు బలాడ్యధీరుడు

దీనత్వమును వరించెను

వైభవమును విడిచెను

దాసునిగా మారెను (2)

దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా

||పరమ||



అనాదివాక్యమే కృపాసమేతమై

ధరపై కాలుమోపెను

ఆ నీతితేజమే నరావతారమై

శిశువై జననమాయెను

పాపి జతను కోరెను

రిక్తుడు తానాయెను (2)

భూలోకమును చేరెను యేసురాజుగా

||పరమ||



నిత్యుడు తండ్రియై విమోచనార్ధమై

కుమారుడై జనించెను

సత్య స్వరూపియై రక్షణ ధ్యేయమై

రాజ్యమునే భరించెను

మధ్య గోడ కూల్చను

సంధిని సమకూర్చను(2)

సఖ్యత నిలుప వచ్చెను శాంతి దూతగా

||పరమ||

أحدث أقدم