Yesu raka tharuna maye nivu siddhama sodhara యేసు రాక తరుణ మాయే నీవు సిద్దమా సోదర

యేసు రాక తరుణ మాయే

నీవు సిద్దమా !  సోదర!

ఆ పవిత్రుని చేరుటకు

అర్హురాలివా?  సోదరి! || 2 ||

తలుపు కొట్టి పిలిచినప్పుడు

పలుకుటకు నీకు సాధ్యమా!

తండ్రి రాజ్యం చేరుటకు

ఇదియే తరుణం ఓ సంఘమా  || 2 ||


పగిలిన నీ హృదయమయిన

వదలకుండా చేర్చుకోనును

విరిగిన నీ మనసునయిన

విడువకుండా అదుకోనును ॥ 2 ॥

నీదు పాపం కొండ అయిన

నిండుగా క్షమియించు వాడు

నీదు గిన్నె పొంగులాగ

అవసరాలు తిర్చుతాడు  ॥ 2 ॥  ॥ యేసు రాక ॥


కాయు కాలము కాదు అంటూ

మోడుగను నివు ఉండబోకు

ఆకలి గొన్న ప్రభు యేసు

శాపములను పొందబోకు  ॥ 2 ॥

తైలము లెని దిపము తోని

పెళ్ళి మెళమును చేరుకోకు

కాలమంతయు ఖర్చు చేసి

అన్యుల గుంపులో కలిసిపోకు ॥ 2 ॥   ॥ యేసు రాక ॥


أحدث أقدم