Siluvalo aa siluvalo a ghora kalvarilo సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో

సిలువలో ఆ సిలువలో

ఆ ఘోర కల్వరిలో

తులువలా మధ్యలో వ్రేలాడిన యేసయ్యా ॥2॥

వెలియైన యేసయ్యా

బలియైన యేసయ్యా

నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా ॥2॥

                                                 ॥సిలువలో॥

1

నేరం చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు

భారమైన సిలువ మోయలేక మోసావు

కొరడాలు చెళ్ళిని చీల్చెనే  }

నీ సుందర దేహమునే       }॥2॥

తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలు॥2॥

॥వెలియైన॥                              ॥సిలువలో॥

2

వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలే

మోమున ఉమ్మివేయ మౌనివైనావే

దూషించి అపహసించి హింసించిరా నిన్ను ॥2॥

ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా ॥2॥

॥వెలియైన॥                              ॥సిలువలో॥

3

నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్

నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్  నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం ॥2॥

సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను॥2॥

॥వెలియైన॥                              ॥సిలువలో॥


Previous Post Next Post