Na priyuda yesayya na sailama rakshana srumgama నా ప్రియుడా యేసయ్య నా శైలమా రక్షణ శృంగమ

నా ప్రియుడా యేసయ్య..........

నా శైలమా రక్షణ శృంగమ........

యుగయుగాలు నిన్నే వివరించెద

నా స్వాస్థమ నిన్నే దరియించెద

నిన్నే సేవించెద.....................

                           " నా ప్రియుడ "

(1)

పరిమళించెనే ప్రతివసంతము.......

మధురమైన నీ ప్రేమలో................

అసాధ్యమైన కార్యాలెన్నో.............

జరిగించేని నీ బాహువు............... "2"

ప్రతి దినం ప్రతి క్షణం

నన్ను వెంబడించె  నీవాగ్దానం....... "3"

                           " నా ప్రియుడ "

(2)

సేదదీరేనే నా ప్రాణం..................

విడువని నీదు కృపలో...............

అనంతమైన ఆనందాన్ని............

కలిగించెనునీకౌగిలి....................

ప్రతి దినం ప్రతి క్షణం

నను వెంబడించె నీ అభిషేకం...... "3"

                          " నా ప్రియుడ "

(3)

ఆత్మ వసుడనై ఆరాధించేద.........

అనుదినము నీ మహిమలో.........

అక్షయమైన అనుబంధాన్ని..........

అను గ్రహించెను నీ సిలువ.......... "2"

ప్రతి దినం ప్రతి క్షణం

నను వెంబడించె నీసహవాసం...... "3"

                         " నా ప్రియుడ "


Previous Post Next Post