Saatileni dhaivama na yesayya సాటిలేని దైవమా నా యేసయ్యా

సాటిలేని దైవమా నా యేసయ్యా

మాటతోనే చేతువు ఏ కార్యమైనా  (2)


తోడు నీడగా వెంట ఉందువు

అన్ని వేళలా ఆదుకొందువు  (2) "సాటిలేని"


బండ నుండి నీటిని - ప్రవహింప జేసావు

ఎండిన యెముకలలో - జీవాన్ని పోసావు  (2)

నీవే నాతో ఉండగా - అపజయమే లేనేలేదుగా (2) "తోడు నీడగా"


ఆశగల ప్రాణాన్ని - సంతృప్తి పరచావు

ఆకలిగొను వారిని - మేలుతో నింపావు (2)

నీవే నాతో ఉండగా - అన్యాయము నాకు జరగదుగా (2)  "తోడు నీడగా"


నా ఎడారి భూములు - తోటగా మార్చావు

సంగీత గానము - వినిపింపజేసావు (2)

నీవే నాతో ఉండగా - అపశృతులే నాలో లేవుగా (2)  "తోడు నీడగా"


أحدث أقدم