ఎన్ని తలచినా ఏది అడిగినా
}
జరిగేది నీచిత్తమే
}॥2॥ ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
}
నా ప్రార్థనఆలకించుమా }॥2॥
ప్రభువా
1॰
నీ తోడు లేక
నీ ప్రేమ లేక
}
ఇలలోన ఏ ప్రాణి
నిలువలేదు }॥2॥
అడవి పూవులే నీ ప్రేమ
పొందగా ॥2॥
నా ప్రార్థన ఆలకించుమా ॥2॥ ప్రభువా ॥ఎన్ని॥
2॰
నా ఇంటి దీపం
నీవే అని తెలసి
}
నా హృదయం నీ
కొరకై పదిలపరచితి }॥2॥
ఆరిపోయిన నా వెలుగు దీపము ॥2॥
వెలిగించుము నీ ప్రేమతో ॥2॥ ప్రభువా ॥ఎన్ని॥
3॰
ఆపదలు నన్ను వెన్నంటియున్నా }
నా కాపరి నీవై
నన్నాదుకొంటివి
}॥2॥
లోకమంతయూ నన్ను విడచినా ॥2॥
నీ నుండి వేరు
చెయ్యవు ॥2॥ ప్రభువా ॥ఎన్ని॥
4॰
నా స్థితి గమనించి
నన్నూ ప్రేమించి }
నా కొరకై కల్వరిలో
యాగమైతివి
}॥2॥
నీదు యాగమే నా మోక్ష
మార్గము ॥2॥
నీయందే నిత్యజీవము ॥2॥ ప్రభువా
॥ఎన్ని॥