Yem chesanayya neekosam e brathukunicchavani ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని



ఏం చేసానయ్యా నీకోసం బ్రతుకునిచ్చావని (2)

ఏం మోసానయ్యా నీకోసం
నీవు నన్ను చూచావని (2)

ఒక్కరినైనా ఒక ఆత్మనైనా

రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా||


ప్రాణమిచ్చావయ్యా
బుద్ధినిచ్చావయ్యా

మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2)

ఎన్ని ఇచ్చినా నిన్నే నేను
ఘనపరచానా

నిన్నే ఎదిరించానా (2)

ఇప్పటికైనా నీ కోసం నే
కష్టపడతానయ్యా (2)

నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2)
||ఏం చేసానయ్యా||


ధనమునిచ్చావయ్యా
ఘనతనిచ్చావయ్యా

శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2)

ఎన్ని ఇచ్చినా నీకై నేను
ఖర్చయ్యానా

నా కడుపు నింపుకున్నానా (2)
||ఇప్పటికైనా ||


ఇల్లునిచ్చావయ్యా
వాహనమునిచ్చావయ్యా

భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2)

ఎన్ని ఇచ్చినా నీకై నేను
కష్టించానా

సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||


أحدث أقدم