Nuvve kavali yesuku nuvve kavali ninu dhivinchagorina నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి నిను దీవించగోరిన


Song no: 117




    నువ్వే కావాలి యేసుకు నువ్వే కావాలి

    నిను దీవించగోరిన తండ్రికి నువ్వే కావలి



    నిను హెచ్చించగోరిన రాజుకు నీ హృదయము నివ్వాలి

    నీవున్న రీతిగానే - వట్టి పాత్రగానే } 2 {నువ్వే కావాలి}



  1. నీకున్న ధనధాన్యము అక్కరలేదు

    నీదు అధికారము అక్కరరాదు

    నీదు పైరూపము లెక్కలోనికిరాదు

    నీదు వాక్చాతుర్యము పనికిరాదు } 2



    అ.ప: నిన్ను నీవు తగ్గించుకొని - రిక్తునిగా చేసుకొని

    విరిగి నలిగిన హృదయంతో దైవసన్నిధి చేరాలి {నువ్వే కావాలి}




  2. నీకున్న జ్ఞానమంతా వెర్రితనము

    నీకున్న ఘనతవల్ల లేదే ఫలితము

    నీ గోప్పపనులతో ఒరిగేది శూన్యము

    నీ మంచితనము ముండ్లతో సమానము } 2 {నిన్ను నీవు }



Previous Post Next Post