Yekkadekkado putti yekadekkado perigi ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి






చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో 


.. దేవుని
సంకల్పం (ఇది) సృష్టిలో విచిత్రం
/2/





ఒంటరి బ్రతుకులు విడిచెదరు


ఒకరికొరకు
ఒకరు బ్రతికెదరు /2/


పెళ్లినాటినుండి
తల్లిదండ్రుల వదలి 


భార్యాభర్తలు
హత్తుకొనుటేమిటో /దేవుని/





గతకాల కీడంతా మరిచెదరు


మేలులతో సంతసించెదరు /2/


పెళ్లినాటినుండి
ఒకరి కష్టం ఒకరు 


ఇష్టముతో పంచుకొనుటేమిటో /దేవుని/





ఫలియించి భూమిని నింపెదరు


విస్తరించి
వృద్ధిపొందెదరు /2/


పెళ్ళి నాటినుండి మా కుటుంబం
అంటూ 


ప్రత్యేకముగా
ఎంచుకొనుటేమిటో /దేవుని/






أحدث أقدم