Vacchindhi vacchindhi madhuramaina samayam వచ్చింది వచ్చింది మధురమైన సమయం






తెచ్చింది నూతన కాంతుల ఉదయం 


రావయ్యా వరుడా (రావమ్మా వదువాసుస్వాగతం 


నీకోసమే  స్వాగత గీతం 


1


మల్లెలు పరిమళం చల్లినవేళ


అల్లరి తెమ్మెర తాకినవేళ /2/


వెల్లువై ఆనందం పొంగిన వేళ 


మెల్లగ నీ పాటి దరిచేరగా /2/రా/


2


కోయిల గానాలు వినిపించువేళ


కోరిన ఘడియలు ఎదురైనవేళ /2/


చామంతులే పలకరించినవేళ 


చేయందుకొని సతిని స్వీకరించగా /2/రా/


3


పరలోక వాకిళ్లు తెరచుకొన్నవేళ


పరమాశీర్వాదాలే కురియుచున్నవేళ /2/


మనసైన నీ వరుడు ఎదురు చూచువేళ 


వినయముగా నీ ప్రియుని సంధించగా /2/రా/









أحدث أقدم