Thipi asala mandharalu virabusina e vela తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ


Song no: 175





    తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ


    చిలిపి ఊసులు సింధూరాలు కలబోసిన శుభవేళ


    అనురాగంతో ఒకటవ్వాలని


    అనుకున్నవన్నీ నిజమవ్వాలని


    ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం


    దీవిస్తూ శుభముగ మీ పరిణయం {తీపి ఆశల}



  1. ఇన్నినాళ్లుగా వేచిన సమయం ఎదురుga నిలచింది


    చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది } 2


    కలకాలం మీరు కలసి ఉండాలని


    చిరజీవం మీపై నిలిచి ఉండాలని


    ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం


    దీవిస్తూ శుభముగ మీ పరిణయం {తీపి ఆశల}






  2. త్రియేక దేవుని ఘన సంకల్పం ఇల నెరవేరింది


    ఇరు హృదయాల సుందర స్వప్నం నిజముగ మారింది } 2


    అరమరికలు లేక ఒకటి కావాలని


    పరలోక తండ్రికి మహిమ తేవాలని

    ఆశిస్తూ పాడుతున్నా సుస్వాగతం


    దీవిస్తూ శుభముగ మీ పరిణయం {తీపి ఆశల}









Previous Post Next Post