Devuni Prema Idigo Janulara దేవుని ప్రేమ ఇదిగో జనులార


Song no: 149



    దేవుని ప్రేమ ఇదిగో – జనులార– భావంబునం దెలియరే

    కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును

    పరలోక – జీవంబు మనకబ్బును } 2 || దేవుని ||


  1. సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను } 2

    సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను } 2 || దేవుని ||




  2. మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను } 2

    మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే } 2 || దేవుని ||




  3. యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల } 2

    దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు } 2 || దేవుని ||



  4. పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి } 2

    పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను } 2 || దేవుని ||




  5. సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను } 2

    సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను } 2 || దేవుని ||




  6. చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను } 2

    సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి } 2 || దేవుని ||




  7. గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే } 2

    మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను } 2 || దేవుని ||





  8. చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను } 2

    పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ } 2 || దేవుని ||





  9. ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి } 2

    వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు } 2 || దేవుని ||




  10. ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను } 2

    మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను } 2 || దేవుని ||




  11. రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్ } 2

    రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను } 2 || దేవుని ||




  12. రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును } 2

    పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా } 2 || దేవుని ||




  13. మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు } 2

    నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్ } 2 || దేవుని ||




  14. పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు } 2

    పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను } 2 || దేవుని ||




  15. నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును } 2

    నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను } 2 || దేవుని ||








    Devuni Prema Idigo – Janulaara – Bhaavambunam Deliyare

    Kevalamu Nammukonina – Paraloka – Jeevambu Manakabbunu      ||Devuni||


    Sarvalokamu Manalanu – Thana Vaakya – Sathyambutho Jesenu

    Sarvopakaarudunde – Mana Meeda – Jaaliparudai Yundenu      ||Devuni||


    Maanavula Rakshimpanu – Devundu – Thana Kumaaruni Bampenu

    Mana Shareeramu Daalchenu – Aa Prabhuvu – Mana Paapamunaku Doorude      ||Devuni||


    Yesu Kreesthanu Peruna – Rakshakudu – Velasi Naadilalopala

    Dosakaari Janulatho – Nentho -Su Bhaashalanu Balkinaadu      ||Devuni||


    Paapa Bhaarambu Thoda – Ne Proddu – Prayaasamula Bondedi

    Paapulandaru Nammina – Vishraanthi – Paripoornamitthu Nanenu      ||Devuni||


    Sathulaina Purushulainan – Yaa Kartha – Sarva Janula Yedalanu

    Sathpremaga Nadichenu – Paraloka – Sadhbodhalika Jesenu      ||Devuni||


    Chaavu Nondina Kondarin – Yesundu – Chakkagaa Brathikinchenu

    Sakala Vyaadhula Rogulu – Prabhu Nanti – Swasthambu Thaa Mondiri      ||Devuni||


    Gaali Sandrapu Pongulan – Saddanipi – Neellapai Nadachinaade

    Melu Gala Yadbhuthamulu – Eelaagu – Vela Koladiga Jesenu      ||Devuni||


    Chethula Kaallalonu – Raa Raaju – Chera Mekulu Bondenu

    Paathakulu Gottinaare – Parishuddha – Neethi Thaa Morvalekan      ||Devuni||


    Odulu Rakthamu Gaaraga – Debbalu – Chedugu Landaru Gottiri

    Vadimullu Thala Meedanu – Bettiri – Orcheno Rakshakundu      ||Devuni||


    Inni Baadhalu Bettuchu – Danu Jampu – Chunna Paapa Narulanu

    Manninchu Mani Thandrini – Yesundu – Sannuthitho Vedenu      ||Devuni||


    Rakshakudu Shrama Bondagaa – Deshambu – Thakshanamu Cheekatayyen

    Rakshakudu Mruthi Nondaga – Thera Chinigi – Raathi Kondalu Pagilenu      ||Devuni||


    Raathi Samaadhilonu – Rakshakuni – Neethigala Dehambunu

    Paathi Pettiri Bhakthulu – Nammina – Naathu Landaru Joodagaa      ||Devuni||


    Moodava Dinamanduna – Yesundu – Mruthi Gelchi Lechinaadu

    Naadu Nammina Manujulu – Choochiri – Naluvadi Dinamulandun     ||Devuni||


    Padunokandu Maarulu – Vaaralaku – Brathyakshu Daaye Nesu

    Paralokamuna Kegenu – Thana Vaartha – Brakatinchu Mani Palkenu      ||Devuni||


    Nammi Baapthismamondu – Narulaku – Rakshana Mari Kalgunu

    Namma Nollaka Poyedu – Narulaku – Narakambu Siddhamanenu     ||Devuni||








Previous Post Next Post