Neevunna na gruhamu anandha nilayamu నీవున్న నా గృహము ఆనంద నిలయము


Song no:






నీవున్ననా గృహము ఆనంద నిలయము

నాకున్న సర్వము ప్రభు
నీవిచ్చిన స్వాస్థ్యము

ప్రభు స్తుతియించెదన్ నిను ప్రణుతించెదన్ నేను
నా ఇంటివారితో

||నీవున్న||

1.నీవే గృహమును కట్టనిచో పనివారి ప్రయాస వ్యర్థమే

నీవే కరుణ చూపనిచో అనుభవించుట
అసాధ్యమే

||ప్రభు||

2.నీవే కావలి కాయనిచో మేల్కొనియుండుట
వ్యర్థమే

నీవే తాలిమి చూపనిచో జీవించుట ఇల అసాధ్యమే

||ప్రభు||

3.నీవే కృపగల దేవుడవు మేలులతో
తృప్తిపరచెదవు

నీవే సర్వసమర్ధుడవు సమృద్దితో నన్ను నింపెదవు

||ప్రభు||



أحدث أقدم