Nalone namdhi palakali nalone marpuni chudali నాలోనే నాంది పలకాలి నాలోనే మార్పుని చూడాలి






పాత రోత బ్రతుకుని
విడిచినవాడనై - నూతన హృదయము పొందిన
వాడనై


నే జీవించాలి - నే జీవించాలి
- నీకై జీవించాలి





chorus – start


సత్యమేదో తెలియక మొదలైన ఆరాటం


నిజ దేవుడెవరో ఎరుగక లోలోన
పోరాటం


క్రీస్తును
జగమెరుగ మంచి తరుణం 


chorus – end





1. నీ వాక్యము నాలో ఫలియించాలి  -
నా ప్రార్ధనతో నే
బలపడాలి 


నీ ప్రేమను నే పంచాలి  -  నీ మార్గములో
నే సాగిపోవాలి      (2)


యేసూ నీవే నిజదైవమని - మార్గము,సత్యంజీవమని


నే ప్రకటించాలి -  నే ప్రచురించాలి
- నీ సువార్తను నే
ప్రకటించాలి





chorus – start


ఎన్నో రాగ  ద్వేషాలు - కరువైన దయ
దాక్షిణ్యాలు


ఎన్నో ఆక్రందనలు  - కడకు రాని కన్నీటి
బాధలు


రక్షకుని ఎరుగక - నశించిపోతోంది
లోకము


chorus – end





2 పిలిస్తే
పలికే దైవము నీవే అని  -
కాచి కాపాడే కనుపాపవని 


మహిమను వీడిన రారాజువని - మహికరుదెంచిన
మెస్సయ్యవని  (2)


యేసు దేవా నీవే లోక
రక్షకుడవని - యేసు దేవా నీవే
లోక శాంతిదాతవని


నే ప్రకటించాలి -  నే ప్రచురించాలి
- నీ సువార్తను నే
ప్రకటించాలి



Previous Post Next Post