Kalyaname vaibhogame kamaneeya కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం






శ్రుతిలయల సుమధుర గీతం /2/


దైవ రచిత సుందర కావ్యం /కళ్యాణమే/


1


పరమ దైవమె ప్ర్రారంభించిన పరిశుద్ధమైన కార్యం /2/


నరుని మంచికై తన చేతులతో 


ప్రభు రాసిచ్చిన పత్రం /కళ్యాణమే/


2


కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం


మోడుగానున్న జీవితాలు /2/  


చిగురింపజేసే వసంతం  /కళ్యాణమే/


3


దేవదూతలే తొంగిచూసేటి దృశ్యం


భావమధురిమలు పొంగజేసేటి /2/ 


కమనీయమైన చిత్రం /కళ్యాణమే/









Previous Post Next Post