Kalyana veduka ramaniya geethika కళ్యాణ వేడుక రమణీయ గీతిక






శుభప్రద
ఆశాదీపికసుమధుర స్వరమాలిక 


క్రీస్తు
సంఘ ప్రేమకు జ్ఞాపిక 


నూతన జీవిత ప్రారంభ వేదిక 


1


వివాహ వ్యవస్థను చేసిన దేవుడు


మొదటి వివాహము జరిగించినాడు 


సంఘ వదువుకై ప్రాణమిచ్చిన ప్రియుడు 


ఈనాటి పెళ్ళికి కారణభూతుడు 


కడపటి పెళ్ళికి ఆయనే వరుడు 


2


ఒకరికి ఒకరు సహకారులుగా


సంతోషముతో
ఇల జీవించగా 


సంతానముతో
దీవించబడగా 


సహవాసములో
సంతృప్తి చెందగా 


పరిశుద్ధుడే
కలిపె ఇరువురిని ఒకటిగా 


3


కిలకిల రవళుల వీణెలు మ్రోగెను


ఆనంద లహరుల సందడి సాగెను 


పరలోక దూతల సంతోష గానాలు 


బంధుమిత్రుల
అభినందన మాలలు 


జంట కనులలో వెలిగే
కాంతులు



Previous Post Next Post