ankitham prabhu naa jeevitham అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా





అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా - 2

నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా


మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా

నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా

నీ కృపలో బహుగా ఫలించుటకు-ఫలింపని వారికి
ప్రకటించుటకు
- 2

అంగీకరించుము నా సమర్పణ (అంకితం)


కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు
దేవా

చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా

నీ సన్నిధిలో ప్రకాశించుటకు
-అంధకార ఛాయలను
తొలగించుటకు
-2

అంగీకరించుము నా సమర్పణ (అంకితం)



أحدث أقدم