Andala udyana vanama అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా





అందాల ఉద్యానవనమా
క్రైస్తవ సంఘమా (2)

పుష్పించలేక ఫలియింపలేక (2)

మోడై మిగిలావ నీవు (2)
||అందాల||





ప్రభు ప్రేమలో బాగు చేసి శ్రేష్టము
ద్రాక్షాగ నాటాడుగా (2)

కాచావు నీవు కారు ద్రాక్షాలు (2)

యోచించు ఇది న్యాయమేనా (2)
  ||అందాల||





ప్రభు యేసులో నీవు నిలచి పరిశుద్ధాత్మతో
నీవు పయనించుమా (2)

పెరిగావు నీవు ఫలియింపలేక (2)
యోచించు
ఇది న్యాయమేనా (2)
   ||అందాల||





ఆకలిగొని నీవైపు చూడ ఆశ నిరాశాయే ప్రభు యేసుకు
(2)


ఇకనైన నీవు నిజమైన ఫలముల్ (2)

ప్రభు కొరకై ఫలియింపలేవా (2)
  ||అందాల||



أحدث أقدم