Yese gappa devudu mana sakthi manthudu యేసే గొప్ప దేవుడు - మన శక్తిమంతుడు



యేసే గొప్ప దేవుడు - మన శక్తిమంతుడు

యేసే ప్రేమపూర్ణుడు - యుగయుగములు స్తుతిపాత్రుడు

స్తోత్రము మహిమా-జ్ఞానము శక్తి-ఘనతా బలము - కలుగును ఆమెన్‌


1. మహా శ్రమలలో - వ్యాధి బాధలలో

సహనము చూపి స్థిరముగ నిలిచిన - యోబు వలెనే జీవించెదను

అద్వితీయుడు ఆదిసంభూతుడు దీర్ఘశాంతుడు మనప్రభు యేసే ||స్తోత్రము||


  2. ప్రార్ధన శక్తితో - ఆత్మ బలముతో

లోకమునకు ప్రభువును చాిన - దానియేలు వలె జీవింతును

మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయదుర్గము మనప్రభు యేసే ||స్తోత్రము||


3. జీవితమంతా - ప్రభుతో నడచి

ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన - హనోకు వలెనే జీవించెదను

అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతిసూర్యుడు మనప్రభు యేసే ||స్తోత్రము||


أحدث أقدم