Viluvainadhi nee jeevitham yesayyake adhi ankitham విలువైనది నీ జీవితం యేసయ్యకే అది అంకితం



విలువైనది నీ జీవితం


యేసయ్యకే అది అంకితం (2)


ఆ దేవ దేవుని స్వరూపంలో


నిను చేసుకున్న ప్రేమ


తన రూపులో నిను చూడాలని


నిను మలచుకున్న ప్రేమ


ఈ మట్టి ముద్దలో – తన ఊపిరే ఊది


నిను నిర్మించిన ఆ గొప్ప ప్రేమ


తన కంటి రెప్పలా – నిను కాచేటి


క్షణమైన నిన్ను ఎడబాయని ప్రేమా…         ||విలువైనది||


ప్రతి అవసరాన్ని తీర్చే


నాన్న మన ముందరుండగా


అనుక్షణమున నీ చేయి విడువక


ఆయనీతో నడిచెగా


ఎటువంటి బాధైనా – ఏలాంటి శ్రమ అయినా


నిను విడిపించే దేవుడుండగా


అసాధ్యమేముంది – నా యేసయ్యకు


సాటి ఏముంది ఆ గొప్ప ప్రేమకు          ||విలువైనది||


Viluvainadi Nee Jeevitham


Yesayyake Adi Ankitham (2)


Aa Deva Devuni Swaroopamlo


Ninu Chesukunna Prema


Thana Roopulo Ninu Choodaalani


Ninu Malachukunna Prema


Ee Matti Muddalo – Thana Oopire Oodi


Ninu Nirminchina Aa Goppa Prema


Thana Kanti Reppalaa – Ninu Kaacheti


Kshanamaina Ninnu Edabaayani Premaa…           ||Viluvainadi||


Prathi Avasaraanni Theerche


Naanna Mana Mundarundagaa


Anukshanamuna Nee Cheyi Viduvaka


Aayaneetho Nadichegaa


Etuvanti Baadhainaa – Elaanti Shrama Ainaa


Ninu Vidipinche Devudundagaa


Asaadhyamemundi – Naa Yesayyaku


Saati Emundi Aa Goppa Premaku             ||Viluvainadi||


Previous Post Next Post