Nee Jaldaru Vrukshapu Needalalo nenanandha నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానంద భరితుడనైతిని



నీ జల్దరు వృక్షపు నీడలలో

నేనానంద భరితుడనైతిని (2)

బలు రక్కసి వృక్షపు గాయములు (2)

ప్రేమా హస్తములతో తాకు ప్రభు (2)     ||నీ జల్దరు||


నా హృదయపు వాకిలి తీయుమని

పలు దినములు మంచులో నిలచితివి (2)

నీ శిరము వానకు తడిచినను (2)

నను రక్షించుటకు వేచితివి (2)    ||నీ జల్దరు||


నీ పరిమళ పుష్ప సుగంధములు

నా రోత హృదయమును నింపినవి (2)

ద్రాక్షా రస ధారల కన్న మరి (2)

నీ ప్రేమే ఎంతో అతి మధురం (2)     ||నీ జల్దరు||


ఓ ప్రియుడా నా అతి సుందరుడా

దవళ వర్ణుడా నాకతి ప్రియుడా (2)

వ్యసనా క్రాంతుడుగా మార్చబడి (2)

నీ సొగసును నాకు నొసగితివి (2)      ||నీ జల్దరు||


Nee Jaldaru Vrukshapu Needalalo

Nenaananda Bharithudanaithini (2)

Balu Rakkasi Vrukshapu Gaayamulu (2)

Premaa Hasthamulatho Thaaku Prabhu (2)      ||Nee Jaldaru||


Naa Hrudayapu Vaakili Theeyumani

Palu Dinamulu Manchulo Nilachithivi (2)

Nee Shiramu Vaanaku Thadichinanu (2)

Nanu Rakshinchutaku Vechithivi (2)      ||Nee Jaldaru||


Nee Parimala Pushpa Sugandhamulu

Naa Rotha Hrudayumunu Nimpinavi (2)

Draakshaa Rasa Dhaarala Kanna Mari (2)

Nee Preme Entho Adthi Madhuram (2)      ||Nee Jaldaru||


O Priyudaa Naa Athi Sundarudaa

Davala Varnudaa Naakathi Priyudaa (2)

Vyasanaa Kraanthudugaa Maarchabadi (2)

Nee Sogasunu Naaku Nosagithivi (2)      ||Nee Jaldaru||


Previous Post Next Post