Srusti karthavaina yehova nee chethi paniyaina napai సృష్టికర్తవైన యెహోవా నీ చేతి పనియైన


Song no: 170



    సృష్టికర్తవైన యెహోవా.... నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ

    మంటికి రూపమిచ్చినావు....మహిమలో స్ధానమిచ్చినావు....

    నాలో. . . . నిన్ను చూసావు....నీలో. . . . నన్ను దాచావు....

    నిస్వార్ధమైన నీ ప్రేమమరణము కంటే బలమైనది నీప్రేమ || సృష్టికర్తవైన ||



  1. ఏ కాంతిలేని నిశిధిలోఏ తోడు లేని విషాదపు విధులలో

    ఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్నాతండ్రివి !!2!!

    యేసయ్యా నను అనాధగ విడువక

    నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి !!2!! || సృష్టికర్తవైన ||




  2. నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా

    నశించిపోతున్న నన్ను వెదకి వచ్చినన్నాకర్షించిన ప్రేమ మూర్తివి !!2!!

    యేసయ్యా నను కృపతో బలపరచి

    ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి !!2!! || సృష్టికర్తవైన ||



Previous Post Next Post