Raaraju janminche ielalona yesu రారాజు జన్మించే ఇలలోన యేసు



రారాజు జన్మించే ఇలలోన

యేసు రారాజు జన్మించే ఇలలోన (2)

ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా

రండీ మనమంతా చాటి చెప్పుదాం (2)

ఓ సోదరా… ఓ సోదరీ… (2)

విష్ యు హాప్పీ క్రిస్మస్

అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2)       ||రారాజు||

అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా

గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2)

రాజులకు రారాజు పుడతాడంటూ

లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2)

రాజాధి రాజుని చూడాలంటూ

(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)        ||ఓ సోదరా||

అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా

(అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2)

రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ

గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2)

ఈ లోక రక్షకుని చూడాలంటూ

(ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)        ||ఓ సోదరా||


أحدث أقدم