Nee prema yentho madhuram నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో




Song no:



నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం

 యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం

 యేసయ్య మధురాతి మధురం యేసయ్యా..



1. తల్లికుండునా నీ ప్రేమ - సొంత చెల్లికుండునా నీ ప్రేమ

 అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమ



2. శాంతమున్నది నీ ప్రేమలో - దీర్ఘశాంతమున్నది నీ ప్రేమలో

 బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో



3. నాకై సిలువనెక్కెను నీ ప్రేమ - నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ

 నాకై మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమ



4. మర్చిపోనిది నీ ప్రేమ - నను మార్చుకున్నది నీ ప్రేమ

 కనురెప్పలాంటిది నీ ప్రేమ - చిరకాలముండును నీ ప్రేమ

أحدث أقدم