Dhikkulenni thirigina ye dhikka vedhakina దిక్కులెన్ని తిరిగినా ఏ దిక్కు వెదకినా




Song no:






దిక్కులెన్ని తిరిగినా
ఏ దిక్కు వెదకినా (2)

మనకు దిక్కు ఈ బాల యేసుడే

ఈ ధరణిలో జోల   పాడ రారండయ్యో

ఓ జనులారా మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2)


కన్య గర్భమందు నేడు
కరుణగల రక్షకుండు (2)

స్థలము లేక తిరిగి వేసారెను

నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)

కల్లబొల్లి కథలు కావు ఆ గొల్ల బొయల దర్శనంబు (2)

నేడు నోవాహు ఓడ జోరేబు కొండ

గుర్తుగా ఉన్నాయి చూడండి      
 
 ||దిక్కులెన్ని||




దిక్కులేని వారినెల్ల
పాపమందు బ్రతికేటోళ్ల (2)

తన మార్గమందు నడుప బుట్టెను

ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2)

జన్మించాడు నేడు ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2)

నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి

హృదయాలు అర్పించినారయ్యో      
   
  ||దిక్కులెన్ని||



أحدث أقدم