Yenthati vadanu nenu yesayya konthaina yigyudanu kanayya ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను




Song no:



ఎంతటి వాడను నేను యేసయ్యా

కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)

ఇంతగ నను హెచ్చించుటకు

ఈ స్థితిలో నన్నుంచుటకు (2)||ఎంతటి||



ఐశ్వర్యము గొప్పతనమును

కలిగించు దేవుడవీవే

హెచ్చించువాడవును

బలమిచ్చువాడవు నీవే (2)

అల్పుడను మంటి పురుగును

నన్ను ప్రేమించినావు

ప్రాణమును నీ సర్వమును

నా కొరకై అర్పించినావు ||ఎంతటి||



నిను వెంబడించువారిని

నిజముగ సేవించువారిని

నీవుండే స్థలములలో

నిలిచే నీ సేవకుని (2)

ఎంతో ఘనపరచెదవు

ఆశీర్వదించెదవు

శత్రువుల కంటె ఎత్తుగా

అతని తలను పైకెత్తెదవు ||ఎంతటి||



వినయముగల మనుష్యులను

వర్దిల్లజేసెదవు

గర్విష్టుల గర్వమునణచి

గద్దె నుండి దించెదవు (2)

మాదు ఆశ్రయ దుర్గమా

మేమంతా నీ వారమే

మా శైలము మా కేడెమా

మాకున్నదంతా నీ దానమే ||ఎంతటి||

أحدث أقدم