Sthothrinchi keerthinthumu ghanaparachedhamu స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము



Song no: 201 796



    స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము

    ఆదరించి - కాపాడువాడు - ఈడేర్చువాడు


  1. మనకింత వరకు సహాయపడెన్ - తానప్పగించుకొనే మనకై

    మనల నడిపెను సుఖముగను

    తనదు సత్యము నేర్పించి - కనుపాపగ కాచె ఆ ...
    || స్తోత్రించి ||



    ఈ ధరలోని నరులలో - యధార్థ హృదయులకు

    ముదమున తనచిత్తము తెలుపున్

    పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు ఆ ...
    || స్తోత్రించి ||




  2. అన్ని సమయములలో - కన్నులతో బోధించును

    నన్ను మార్చెను తప్పినన్

    పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు ఆ ...
    || స్తోత్రించి ||



    అగ్ని వంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించు

    తగిన సహాయము చేయును

    ఎక్కాలమందును కునుకవు - మక్కువ పిల్లలకు ఆ ...
    || స్తోత్రించి ||



    హాగరును చూచిన కన్నులు - అనేకుల చూచెను

    ఇశ్రాయేలుల కనికరించె

    ఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు ఆ ...
    || స్తోత్రించి ||



    నీతిమంతుల జూచె - దాదిబోలె కాచెన్

    జ్యోతుల వలె నుండును

    అతిబలమిచ్చు అవసరతన్ - క్షితినిను విడువడు ఆ ...
    || స్తోత్రించి ||




  3. ఏడు కన్నులు గలవాడు - నాడు నేడు కాపాడును

    ఎడతెగని చెడుగుల బాపున్

    రేడుల నేర్పరచు వాడు - పాడుడి హల్లెలూయా ఆ ...
    || స్తోత్రించి ||






أحدث أقدم