Ninnega puttuka nedantha nadaka repemo నిన్నేగ పుట్టుక నేడంత నడక రెపేమో చితిక




Song no:

నిన్నేగ పుట్టుక నేడంత నడక రెపేమో చితిక మూన్నాళ్ళ బ్రతుకా

భోగాలు కావాలంటు పాదం భూమిని చుట్టేసాక

ఆగాలి ఎదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక

నాదంటే నాదనుకుంటు ఏంతో కోంత పోగేసాక

నావెంట వచ్చేదేంటని చూస్తే శున్యం అంతా వెనుక



 1 మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కదా ఎండకు వాడాలని అవి సూచించటం లేదా

తేనుందని మురిసే లోగా తుమ్మెద రాదా మాయగా మకరందం పువ్వును విడచిపోదా   //2//

బంధం అనుబంధం లోకంతో సంబంధం గాలికి రాలేటి పువ్వులదా ఈ చందం

 మాయగా మనిషి నేల రాలి వెళ్లి పోతుంటే             || నిన్నేగా ||





2 పువ్వుల సువాసనే మనిషికి పాఠం కాదా  నీతిని వెదజల్లాలని నేర్పించుట లేదా

పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా ... ఓ ఒ    //2//

మాయను నమ్మొద్దు మాయచేసి బ్రతుకొద్దు నీ ప్రశ్నకు లొంగి నిన్ను పొడుచుకోవద్దు

లోతు భార్యవలె వెనుక తిరిగి చూడొద్దు









أحدث أقدم