Krupa skhemamu nee saswatha jeevamu కృపా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు




Song no: 178



కృపా క్షేమము నీ శాశ్వత జీవము

నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు /2/

మహోన్నతమైన నీ ఉపకారములు

తలంచుచు అనుక్షణము పరవశించనా

నీ కృపలోనే పరవశించనా /2/



1. నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే

లెక్కకు మించిన దీవెనలైనాయి /2/



అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే

కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను /2/

నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను

నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే /2/

ఆరాధన నీకే  /కృపా/



2. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే

పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి /2/

కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే

గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను /2/

ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే

నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే /2/

ఆరాధన నీకే     /కృపా /



3.నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా

నా హృది నీ కొరకు పదిలపరచితిని /2/

బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా

అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా /2/

ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే

ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే /2/

ఆరాధన నీకే /కృపా/

أحدث أقدم