Anni sadyame yesuku anni అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే




Song no:


అన్నీ సాధ్యమే

యేసుకు అన్నీ సాధ్యమే (2)

అద్భుత శక్తిని నెరపుటకైనా

ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2)

ఆ యేసు రక్తానికి

సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) ||అన్నీ
సాధ్యమే||



మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు
మార్చెను

మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై
లేపెను (2)

మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను

మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2) ||అన్నీ సాధ్యమే||



బండనే చీల్చగా – జలములే పొంగెను

ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి
పారెను (2)

బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని

మెండైన తన కృపలో – నీకండగా
నిలచును (2) ||అన్నీ సాధ్యమే||



ఏకాంతముగా మోకరిల్లి – ప్రార్ధించుటే శ్రేయము

ఏల నాకీ శ్రమలని
– పూర్ణ మనసుతో వేడుము (2)

యేసయ్య నీ వేదన – ఆలించి
మన్నించును

ఏ పాటి వ్యధలైననూ
– ఆ సిల్వలో తీర్చును (2) ||అన్నీ
సాధ్యమే||



కష్టాల కడలిలో – కన్నీటి లోయలో

కనికరమే ప్రభు చూపును – కంటిపాపలా
కాయును (2)

కలిగించు విశ్వాసము – కాదేదీ అసాధ్యము

క్రీస్తేసు నామములో – కడగండ్లకే మోక్షము (2) ||అన్నీ సాధ్యమే||


أحدث أقدم