Redu messiya janminchenu sridha veedhu ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు




Song no: 111


ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు పురమున
నుద్భువించెను


వేడుకతోడను బాడుఁడి పాటలు రూఢిగ సాతాను కాడిని
దొలఁగింప
||ఱేఁడు||



1. మనకొఱకై శిశువు పుట్టెను అతఁడు మన దోషములను బోగొట్టెను


అనయంబు నతనిమీఁ దను రాజ్యపు భార ము నుంచఁబడె విమో
చనకర్త యితఁ డౌను
||ఱేఁడు||



2. పరలోక సైన్యంబు గూడెను మన వర శిశువును గూర్చి పాడెను


నరులయందున గరుణ ధర సమాధానంబు చిర దేవునికి బహు
మహిమ యటంచును
||ఱేఁడు||



3. కొమ్మ యెష్షయినుండి పుట్టెను చిగురు క్రమ్మర మొద్దున బుట్టెను


కమ్మొను దేవుని యా త్మమ్మును తెలివి జ్ఞా న
మ్మలోచన మహ త్వ మ్మొక్కుమ్మడినాతని
||ఱేఁడు||



4. సర్వశక్తి గల దేవుఁడు మరియు నుర్వియందు దయాస్వభావుఁడు


సర్వమహిమము గల్గు స్వర్గ లోకము వదలి గర్వముతో
నిండిన సర్వంసహా స్థలిపై
||ఱేఁడు||



5. వింతైన వాఁడుగ నుండెను కోరినంత సుందరత లేకుండెను


చింతతోడను మాయా సంగతులగు వారి యంతములేనట్టి
యాపదను వీక్షించి
||ఱే ఁడు||



6. చెదరిన గొఱ్ఱెల వెదకును వాని ముదమున మందలోఁ జేర్చును


సదయత యేసుండు జనితైక సుతుఁడు భా స్వదధిక
విభుఁడాలో చన కర్త జన్మించె
||ఱేఁడు||



7. అక్షయుండగు యేసు వచ్చెను మన రక్షణమ్మును సిద్ధపర్చెను




మోక్షము సరుణా క టాక్షమ్ముతో నియ్య నీక్షితియందున
హెబ్రీ వంశమునందు
||ఱేఁడు|| 


Previous Post Next Post