Rare chuthumu rajasuthudi రారె చూతము రాజసుతుడీ


Song no: 116

రా – హిందుస్థాని తోడి

తా – ఆది



    రారె చూతము – రాజసుతుడీ – రేయి జనన మాయెను = రాజులకు రా – రాజు మెస్సియ – రాజితంబగు తేజమదిగో ॥రారె॥



  1. దూత గణములన్ – దేరి చూడరే – దైవ వాక్కులన్ – దెల్పగా = దేవుడే మన – దీనరూపున – ధరణి కరిగెనీ – దినమున ॥రారె॥




  2. కల్లగాదిది – కలయు గాదిది – గొల్ల బోయల – దర్శనం = తెల్లగానదె – తేజరిల్లెడి – తారగాంచరె – త్వరగ రారే ॥రారె॥




  3. బాలు డడుగో – వేల సూర్యుల – బోలు సద్గుణ – శీలుడు = బాల బాలికా – బాలవృద్ధుల నేల గల్గిన – నాధుడు ॥రారె॥




  4. యూద వంశము – ను ద్ధరింప దా – వీదుపురమున – నుద్భవించె సదమలంబగు – మదిని గొల్చిన – సర్వ జనులకు సార్వభౌముడు ॥రారె॥




Previous Post Next Post