Silanaina nannu silpivai marchavu naloni శిలనైన నన్ను శిల్పివై మార్చావు నాలోని

శిలనైన నన్ను శిల్పివై మార్చావు

నాలోని ఆశలు విస్తరింపచేశావు /2/

నీప్రేమనాపై కుమ్మరించుచున్నావు /2/

నీ ప్రేమే నా ఊపిరి – నీ ప్రేమే నాకాపరి /2/శిల/


1.మొడుబారిన నాజీవితం – నీప్రేమతోనే చిగురింపచేసావు /2/

నీప్రేమాభిషేకం నాజీవిత గమ్యం /2/

వర్ణించలేను లెక్కించలేను /2/నీ ప్రేమే/


2.ఏవిలువలేని అభాగ్యుడను నేను – నీప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు /2/

నాయెడల నీకున్న తలంపులు విస్తారం /2/

నీకొరకే నేను జీవింతునిలలో /2/నీప్రేమే/


3.వూహించలేను నీ ప్రేమ మధురం – నా ప్రేమ మూర్తి నీకే నా వందనం /2/

నీప్రేమే నాకాధారం – నాజీవితం లక్ష్యం /2/

నీప్రేమ లేక – నేనుండలేను /2/నీప్రేమే/


Previous Post Next Post