Song no:
రెండే రెండు దారులు
ఏ దారి
కావాలో మానవా "2"
ఒకటి పరలోకం మరియొకటి
పాతాళం
1. పరలోకం
గొప్ప వెలుగుతో
ఉన్నది పరిశుద్ధులకోసం
రాత్రి ఉండదు పగలు
ఉండదు – సూర్యుడుండడు
చంద్రుడుండడు
దేవుడైన ప్రభువే ప్రకాశించుచుండెను
–
యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండెను
–
యేసు ప్రభుని నమ్ముకో
పరలోకం చేరుకో
||రెండే||
2. పాతాళం
అగ్నిగుండము ఉన్నది ఘోర పాపుల కోసం
అగ్ని ఆగదు పురుగు
చావదు –
అగ్నిలోన ధనవంతుడు బాధపడుచుండెను
అబ్రాహాము రొమ్మున లాజరును
చూశాడు –
లాజరును చూసి దాహమని
అడిగాడు –
యేసు ప్రభుని నమ్ముకో
పరలోకం చేరుకో ||రెండే||
3. పుడతావు
నీవు దిగంబరిగ
వెళతావు నీవు
దిగంబరిగ
గాలి మేడలు ఎన్నో
కడతావు – నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
లోకంలో ఘోరమైన పాపాలు
చేస్తావు – ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు
చేస్తాయి
అగ్నిలోన పడకుండా యేసు
ప్రభుని నమ్ముకో ||రెండే||