Nee snehamu yentho sathyamu adhyanthamu నీ స్నేహము ఎంతో సత్యము ఆద్యంతము





నీ 
స్నేహము ఎంతో సత్యము
 - ఆద్యంతము నా హృదిలో
పదిలము




నా సఖుడా - ప్రియ యేసయ్య


నా హితుడా - స్నేహితుడా


నీవెంత గొప్ప వాడివయా  - నను ఆదరించినావయ





1. సింహాల
బోనులో నా ప్రాణానికి
ప్రాణమైన - నా విభుడవు


చెరసాలలో నా సంకెళ్ళు
విరచి విడుదలనిచ్చిన - రక్షకా


కన్నతల్లి
కూడా నన్నెరుగక  మునుపే నన్నెరిగిన - నా  తండ్రివీ


నా సఖుడా
||





 2.  గొల్యాతైన,
యుద్ధమైన విజయమునిచ్చిన  - వీరుడవూ 


పది వేల మంది
నావైపు కూలినా నాతో నిలచిన
- ధీరుడవూ


నా దోషములను నీదు రక్తముతో
తుడిచివేసిన  - పరిశుద్ధుడవూ


నా సఖుడా
||





3.  ఎన్నిక
లేని నను ప్రేమించిన
- కృపామయుడవూ 


అందరూ విడిచినా నన్నెన్నడు విడువని
- కరుణామయుడవూ


నిస్సారమైన
నా జీవితములో  సారము పోసిన -  సజీవుడవూ


నా సఖుడా
||



Previous Post Next Post